Wednesday, August 28, 2024

29aug24 movie dialogs for practice

30 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు

 బాబు అప్పట్లో రైతే రాజు అన్నారు

 ఇప్పుడు అదే రైతుకు

 కూలి కూలిగా కూడా పనికి రావట్లేదు

 బాబు ఒక ఆడపిల్ల ఏడిస్తే 

ఇంటికి మంచిది కాదంటారు 

 మరి ఒక  రైతు ఏడిస్తే దేశానికి 

ఎలా బాబు మంచిది 


===============


 అన్వర్ నీ లైఫ్ లో నువ్వు ఏది అవ్వాలనుకున్నా అది నీ ఛాయిస్ వల్లే అవ్వాలి

 నీ సిట్యుయేషన్ వల్ల కాదు 

 ఎందుకంటే సిట్యుయేషన్స్ మారిపోతుంటాయి అన్వర్ మారకుండా ఉండాల్సిందే మన క్యారెక్టర్ 

 మొన్నటిదాకా నీ సిట్యుయేషన్ ఏంటి అన్వర్

 మీ ఫాదర్ చనిపోతే ఒక్కడు కూడా రాలేదు 

ఇవాళ వందల మంది వచ్చారు 

 లేటుగా వచ్చారు తప్పే కానీ లేటుగా అయినా వచ్చారు కదా 

 ఏక్ బాత్  బోలు

 అల్లాకే ఘర్ మే  దేర్ హై  

లేకిన్  అన్ దేర్ నహి 


==============


 మా నాన్నకి వ్యవసాయం అంటే పిచ్చి దాన్నే  నమ్ముకున్నాడు 

ఆఖరికి పురుగుల మందు తాగి చచ్చాడు 

 ఈ పురుగుల మందు పంట మీద ఎంత పని చేస్తుందో తెలియదు గానీ మనుషుల మీద మాత్రం బాగా పనిచేస్తుంది 

 ఇక్కడ ఎంతో మంది రైతులు ఇలాగే చచ్చిపోయారు 

 ఎందుకంటే ప్రపంచంలో రైతుల బాధలు ఎవరికి పట్టవు సార్ 

 ఇక్కడ  రైతు అనేవాడికి  విలువ లేదు  

 కనీసం మర్యాద కూడా లేదు 

 ఇక్కడ సమస్య వివేక్ మిట్టల్  ఒక్కడే కాదు సార్ 

 వాడు కాకపోతే ఇంకొకడు వస్తాడు 

 ఇక్కడ సమస్య సొసైటీ సార్ 

 సొసైటీలో రైతు అనేవాడు కేవలం

 సానుభూతి చూపించటానికి పనికొచ్చే  ఒక ఐటమ్ లాగా మారిపోయాడు 


 ==============


 జాబ్ కి లైఫ్ లో ఒక సెక్యూరిటీ గా ఉంటుందని వస్తారు 

 కానీ ఆటకు మాత్రం ఒక పిచ్చితో వస్తారు 

 రాష్ట్రం కోసం ఆడాలనిపిచ్చి 

దేశం కోసం ఆడాలనిపిచ్చి 

 కానీ ఇక్కడ మన సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే 

 గెలిచిన వాళ్ళందరూ మన వాడు మనవాడు అంటారు 

 గెలవాలని ప్రయత్నించే వాడిని మాత్రం ఎవరు ఎంకరేజ్ చేయరు 


==============

 అయినా ఇది తప్పు ఇది తప్పు కాదు అని చెప్పడానికి మనం 

 బ్రతికి మనిషికి స్వార్థమే మూలం ప్రతి మనిషి స్వార్థంతో ని బతుకుతాడు 

 అందుకే బాధపడటం మానేసి మర్చిపోవడం నేర్చుకుందాం 


==============

 ఇప్పుడూ ...పది రూపాయల కాగితం మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు

 2000 నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటారు

 అలా అని రెండు ఒకటే 

 దేని వేల్యూ దానిది 

==============


 శత్రువులు ఎక్కడ ఉండరు రా మన ఇంట్లోనే కూతుళ్లు చెల్లెలు రూపంలో తిరుగుతూ ఉంటారు

 నా బతుకు రోడ్డు వైడనింగ్ లో కొట్టేసిన

  బిల్డింగ్ లాగా తయారయింది 

 వదలడానికి మనసు రాదు 

ఉండటానికి పనికిరాదు 


==============

 ఏది జరగకూడదు అనుకుంటామో అది జరగటమే  జీవితం 

 జీవితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు 

 మన చేతుల్లో ఉండేది జీవితం కాదు 

==============

 ఒక మాట చెప్పనా 

  మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనని ఓదార్చటానికి చాలామంది ఉంటారు 

 నిజానికి వీళ్ళకి  కష్టాలు ఎప్పుడు వస్తాయా వీళ్ళని 

 ఓదార్చే అవకాశం ఎప్పుడు వస్తుందా  అని ఎదురు చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు 


 కానీ మనం ఆనందంగా ఉన్నప్పుడు సక్సెస్ లో ఉన్నప్పుడు చూసి ఆనందపడే వాళ్ళు అసూయ పడకుండా 

 టెంపు చేసే వాళ్ళు దొరకాలంటే పెట్టి పుట్టాలి అమ్మ 


==============

 ఒక్కసారి అ పురాణాలు దాటి వచ్చి చూడు 

 అవసరాల కోసం దారులు తోకే పాత్రలే తప్ప 

 ఈరోజు విలన్లు లేరు ఈ నాటకంలో 

 మనిషిలో లోతుగా కోరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం

 ప్రతి పురుగును కదిలించే నిజం ఒకటే ఆకలి 

 తపించే ఆత్మనల్లా  శాసించే శక్తి ఒకటే ఆశ

 ఆశ ముసిరినప్పుడు ఆలోచన మసకబారుతుంది 

 నీతి నిజాయితీలు కొవ్వొత్తుల కరిగిపోతాయి 

==============

 రంగమార్తాండ 


 అవనికి వెలుగును పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు 


 కడుపుకోతగా భావించి కన్నతల్లి అనాధగా వదిలేసింది 


 విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా 

 శాపగ్రస్తుడిని చేశాడు


 దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని 

 దేవేంద్రుడు శక్తిని హరించాడు 

 

ఓరిమికి ప్రతీకగా పరిడమిల్లె  భూమాత  

 సైతం ఆగ్రహించింది 

 ఇందరి వల్ల 

 ఇందరి వల్ల 

 శక్తి హీనుడినై  నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా 


==============

Gautam nanda dialogs

Simhadri police dialog

==============

No comments:

Post a Comment