Wednesday, September 11, 2024

11 - రంగమార్తాండ

11 -  రంగమార్తాండ 

======================================

 అవనికి వెలుగును పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు 

 కడుపుకోతగా భావించి కన్నతల్లి అనాధగా వదిలేసింది 

 విద్య నేర్పిన గురువు పరమ కిరాతకంగా 

 శాపగ్రస్తుడిని చేశాడు

 దాతృత్వాన్ని ఆసరాగా తీసుకుని 

 దేవేంద్రుడు శక్తిని హరించాడు 

ఓరిమికి ప్రతీకగా పరిడమిల్లె  భూమాత  

 సైతం ఆగ్రహించింది 

 ఇందరి వల్ల 

 ఇందరి వల్ల 

 శక్తి హీనుడినై  నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా 

======================================

 ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

దగధగా ధగాయ రాజమకుట ..సువర్ణ మని కల రాజ రాజేశ్వర ... సుయోధన సార్వభౌమ 

 శరాఘాతాలతో చిద్రమై ...  ఊపిరి అవిరై .. దిగంతాల సరిహద్దులు చేరిపోతున్నా వేల 

 అఖండ భారత సామ్రాజ్యాన్ని ... కురుక్షేత్ర సంగ్రామం లో ...

 కనుక గా ఇస్తానని ..సుష్క వాగ్దానాలు వల్లె వేసిన 

ఈ ధౌర్భగుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా ...

నా దైవ స్వరూపమ ...నన్ను క్షమించ గలవా

No comments:

Post a Comment