Tuesday, October 8, 2024

22) ammo okato tariku dialog

22)  అమ్మో ఒకటో తారీకు సినిమా క్లైమాక్స్ కోర్టు సీన్ డైలాగ్


 మధ్యతరగతి మనిషిగా పుట్టటంనేను చేసిన 
 మొదటి తప్పు 
పెళ్లి చేసుకొని అంతకంటే పెద్ద తప్పు చేశాను 
అధిక సంతానం కనీ క్షమించరాని తప్పు చేశాను
 నన్ను కనీ పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి  గుడ్డివాడిని    చేసి దస్తావిజుల మీద సంతకాలు చేయించుకుని తప్పు చేశాను

 ఒక్కగా నొక్క కొడుకు నన్ను నా కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని  
వాడికొచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయచ్చు  అనే ఆశతో వాడిని మాత్రమే పెద్ద చదువులు చదివించి 
ఆడపిల్లలకి అన్యాయం చేసి తండ్రిగా ఇంకో తప్పు చేశాను

 తక్కువ కట్నం అడిగాడు కదా అని చెప్పి
 కక్కుర్తి పడి వాడు ఎలాంటివాడో తెలుసుకోకుండా పెద్ద కూతురు ఒక దౌర్భాగ్యుడుకి పెళ్లి చేసి 
చివరికి దాన్ని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను 

రెండో కూతురు తన కాళ్ళ మీద దాని నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా ఆ డబ్బులు కూడా వాడుకున్నాను
చివరికి నేను పెళ్లి చేయలేను అని తన మొగుడిని తానే వెతుకుని వెళ్ళిపోతే భారం తగ్గిపోయింది కదా అని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను

 ఫస్ట్ మార్కులు తోటి స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువుకుంటే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడ్ని తీసుకురావాల్సి వస్తుందని చదువుకుంటాను నాన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్షిణ్యంగా దాని నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను

 కొడుకుగా తండ్రిగా నే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెలిది పట్టించుకోలేదు తను తప్పు చేస్తే అడగకుండా మౌనంగా ఉండి తప్పు చేశాను ఇన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్ నేను కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన దారాలు జరగని బాధలు పాలవాడికి నెల వాడికి రెంటికి కరెంటుకి రేషన్ కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి ఆశుభాలకి అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు ఖర్చు

 తెల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగేస్తే అప్పు అన్నిటికీ సాకు ఆ ఒకటో తారీకు అది సర్వరోగనివారిని 
ఒకటో తారీకు ఒకటో తారీకు అని 30 రోజులు ఎదురు చూస్తాం సార్
 చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది వరద బాధితులని ఆదుకోవటానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టే 

 ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి లాగా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది 
 ఒక్క మధ్యతరగతి వాడికి తప్ప 
 ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తే పదిమంది అడ్డ గాడిదల్లాగా తిని కూర్చునే ఈ ఈ దౌర్భాగ్యమైన సంప్రదాయం మారానంతవరకు ఈ మధ్యతరగతి కుటుంబాల కథ ఇంతే సార్ ఇంతే



LB Sriram: 
nenu madya taragati manishi ga puttadam modatitappu,
 pelli chesukoni antakante peddatappu chesanu, 
adhika santananni kani kshamincharani tappu chesanu, 
nannu kani penchi pedda chesina na tandriki 
kanti operation cheinchakunda badhapetti 
guddivadini chesi dastavejulu meeda santakalu cheinchi kodukuga tappu chesanu,

 okka gani okka kodukani nannu kutumbanni uddaristadani 
vadikoche katnamto aadapillala pellillu cheyochani aasato
vadini matrame pedda pedda chaduvulu chadivinchi
 aadapillalaki anyayam chesi tandriga tappu chesanu

, takkuva katnam adigadukada ani kakkurti padi
 aadu etuvantivado telusukokunda pedda kuturini oka dowrbhagyudikichi pelli chesi
 chivariki dani pasupu kunkalu kuda tudipesi marinta tappu chesanu, 

rendo kuturu tanakalla meeda tane nilabadi nalugu dabbulu sampadinchukuntunte
 siggu lekunda ha dabbulu vadukunnanu
 chivariki nenu pelli cheyalenemonani tana mogudini tane vetukkoni vellipote bharam taggindani bhadyata leni tandriga tappukunnanu,

 first markulato school first techukunna na moodo kuturini 
chaduvekkuvaite antakante ekkuva chaduvukunna mogudini tevalsivastundani 
chaduvukuntanu nanna ani asaga noru terichi adigite 
oddamma ani nirdakshanyam ga noru nokkesi marinta tappu chesanu.

kodukuga tandrigane kadu chivariki annaga kuda chellelani pattinchukoledu
 tanu tappu cheste adagakunda mownamga undi tappuchesanu 
inni bhayankaramaina tappulu chesanu sir
. nene kadu madyataragati kutumbamlo puttina prateevadu ee tappule chestunnadu sir 

 endukante burra ninda aasalu, 
intininda kastalu,
 perigina daralu 
taragani bhadalu 

palavadiki, neelavadiki, rentuki, currentuki, rationki, mandulaki, kuralaki,
 kuturlaki, allullaki, kodukulaki, chaduvulaki, pandagalaki, pabbalaki, subalaki, asubalaki,
 annintiki kharchu kharchu kharchu
 tellavarite samasya 
noruvippite dabbu. 
adugeste appu 
annitiki saku okatotariku
 adi sarvaroga nivarini 
okato tariku okato tariku ani muppai rojulu eduru chustam sir
 chivariki adi ila vachi ala vellipotundi 
varadabaditulni aadukodaniki helicopter vachi vellipoinattu.

okato taragati vadiki rendo taragati,
 rendotaragati vadiki moodotaragati ila anni taragatula vallaki edhugudala untundi 
okka madyataragati vadiki matrame edugudala undadu sir.
 okkadu rekkalu mukkalu chesukoni sampadistunte 
10 mandi addagadidulla kurchoni tine dowrbhagya sampradayam
 marananta varaku ma madyataragati kutumbala kada inthe inthe sir

No comments:

Post a Comment