Tuesday, October 8, 2024

21 ) film academy dialogs vfa

  [10/08, 1:40 pm] : 

===========

రేయ్.. రాము...  ఎందుకురా...అలా మాట్లాడుతున్నావు ?...

తప్పు అలా మాట్లాడకు,

 First ...  cool down .... 

అరే.. నాకు అర్ధం కాదు...

 నువ్వు కోపంలో నోటికి ఏది వస్తే 

అది మాట్లాడతావా , 

కొంచెం నిదానంగా రిలాక్స్ అయి ఆలోచిస్తే నిజా నిజాలు తెలుస్తాయి.

 అలా చెయ్యకపోతే మనకి ఇష్టమైన వాళ్ళని దూరం చేసుకుంటాము....

 నేను ఎందుకు చెబుతున్నానో, అర్థం చేసుకుంటావు అనే అనుకుంటున్నాను. 

ఆ తరువాత నీ ఇష్టం... 

==============

 నీకు చాలా సార్లు చెప్పాను, 

అయినా నువ్వు వినవు , 

ఎందుకంటే పొగరు బాగా ఎక్కువయ్యింది. ఏమి చెప్పినా గొర్రెలాగ తల ఆడిస్తావు,

మళ్ళీ "వద్దు" అన్నదే చేస్తావు....

సరే నీ ఇష్టం, చెప్పేది చెప్పాను,

వినకపోతే సమస్యలు నీ చుట్టే తిరుగుతాయి.....

 నీ సావు నువ్వు సావ్....

================

మాకు తెలియదు సర్.... మీరు సదువుకున్నోళ్లు, లోకం గురించి బాగా తెలిసిన వాళ్ళు.

మీరు ఏ పని ఇచ్చిన, చెయ్యడానికి నేను రెడీగా ఉన్నాను సర్.

మా వాళ్ళ దృష్టిలో నేను చెడ్డవాడ్ని అయినా ఫర్వాలేదు సర్.

జీవితాంతం ఇలా ఆలోచించే,

ఈ స్థితిలో ఉన్నాను సర్. ఇంతకంటే నీచంగా బ్రతకలేను సర్....

ఇంక ఆలోచించేది ఏమి లేదు సర్, నేను మనిషిగా బ్రతకాలనుకుంటున్నాను సర్( అని చేతులు ఎత్తి దండం పెట్టాలి)

[==========================

 దిక్కూ దివాణం లేకుండా ఏదోలా బ్రతకాలనుకోకు.. బీ ఫోకస్ట్. 

నీ చుట్టూ అందరూ బ్రతికేదాన్ని చూసి

నువ్వు కూడా బద్ధకంగా ఉండిపోకు..

నువ్వొక  విజేతవి, 

నువ్వు పోరాడి గెలిచేవాడివి.

 జీవితంపై నీ పోరాటాన్ని ప్రదర్శించు!

నీ పోరాటం ఎలా ఉండాలంటే.. నీ నుదురు నుండి చిందిపడే స్వేదం కూడా గర్వపడాలి..

నీ పోరాటం ఎలా ఉండాలంటే బద్ధకంగా బ్రతికే ప్రతోడూ నిన్ను చూసి సిగ్గుతో తల వంచుకోవాలి..

అస్సలు నీ పోరాటం ఎలా ఉండాలంటే, 

సమస్త విశ్వమూ నీకు పాదాక్రాంతం అవ్వాలి.

[=======================

స్టూడెంట్

: అన్నా... 

నువ్వు ఇంత చేసినా 

ఏం ప్రయోజనం అన్నా... 

మనం ఇలా ఉన్నన్ని రోజులు, 

మన బతుకులు ఇలానే వుంటాయ్ అన్న q...

 మార్పు రావాల్సింది.. మనలో... 

మనలో మార్పు రావాలంటే, 

మనం దొంగతనాలు మానాలా.. దొంగతనాలు మానాలంటే.. 

మనకి ఉపాది ఉండాలా.. 

ఉపాది ఉండాలంటే.. 

మనూరికి ఫ్యాక్టరీ రావాలన్నా.. ఫ్యాక్టరీ.

 

మనూరు అభివృద్ధిం చెందాలంటే... మారాల్సింది రాజకీయ నాయకులు కాదు.. పోలీసు వ్యవస్థ కాదు.. 

ప్రభుత్వం కానే కాదు.. 

మనం..మనం మారినప్పుడే 

మన బతుకులు మార్తాయి, 

మన ఊరు మారుతుంది.

[10/08, 1:40 pm] : సినిమా అంటే చాలా మంది లైట్లు,కెమెరాలు,కార్లు, క్యారవాన్లు మాత్రమే అనుకుంటారు కానీ అది కాదు.

పొద్దున 6 గం..ల నుండి సాయంత్రం 6 గంటల వరకు
500 రూ..యాల కోసం జూనియర్ ఆర్టిస్టులు పడే కష్టాలు,
లైట్స్ మెన్ లు లైట్లు మోస్తున్నపుడు పడే బాధలు,
ఫైట్ మాస్టర్ దగ్గర ఫైటర్లకి తగిలే గాయాలు
, హీరో డూప్ లకు విరిగిన ఎముకలు,
డాన్సర్స్ కు జరిగే అవమానాలు,
ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఉన్నదంతా అమ్మేసి
 ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన ప్రొడ్యూసర్లు,
సినిమాలో ఒక్క చిన్న వేషం కోసం 100 ల ఆఫీసులు తిరిగిన ఆర్టిస్టులు,
సినిమాలో ఒక్క చిన్న డైలాగ్ ఉంటే బాగుండు అని ఆశతో ఎదురుచూసే హృదయాలు,
ఎదో ఒక రోజు మనకంటు ఒక రోజు వస్తుందని ఎదురుచూసే అసిస్టెంట్ డైరెక్టర్లు,
నా గురించి కాకపోయినా నేను రాసే మాటల కోసం జనం మాట్లాడుకునే రోజు ఒకటి వస్తుందని వెయ్యి కన్నులతో ఎదురుచూసే రైటర్లు....
 ఇంతమంది కలిస్తేనే ఓ సినిమా...

[10/08, 1:40 pm] : నేను మంచి వాడినా, కాదా అన్నది కాదు ముఖ్యం. ఇక్కడ మాట్లాడేది నీ సంగతి, ముందు దాని గురించి మాట్లాడు, తరువాత మిగతావి అన్ని మాట్లాడుకుందాం......

అర్థం అయ్యిందా....? అర్థం కాలేదు అనుకో, బా....గా... అర్ధం అయ్యేలా వివరించి, విడమరిచి చెబుతా....    okay

[10/08, 1:40 pm] 

విలేజ్ పర్సన్ క్యారెక్టర్

సారు... ఈ వూర్లో పుట్టడమే 

మేము చేసిన పాపమా సారు.. 

ఈ ఊర్లో జీవఛ్చావాల్లా బతకడమే..

 మేము చేసిన నేరమా సారు..

ఎక్కడో ఏదో జరుగుతుంది... 

దానికీ, మాకు సంబంధం లేదని 

మీకు తెలిసినా 

మా ఊరు మీద పడి, 

మమ్మల్నే అనుమానిస్తారు.. 

మా బతుకే అదని, 

మేమే చేసుంటామని 

మా పేర్లే చెప్పి   చెప్పి అవమానిస్తారు..

ఈ ఊర్లో పుట్టడంలో మా తప్పుందేమో గానీ..

మా బతుకుల్లో తప్పు లేదు సారు.

[10/08, 1:40 pm] : నవ్వండి సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో......

 

[10/08, 1:40 pm] : అది కాదు శ్యామలా, నీకు చాలా రోజుల నుండి నీకో విషయం చెప్పాలి అనుకుంటున్నాను,(సిగ్గు పడుతూ)

నిన్ను చూడాగానే అన్నీ మరిచిపోతాను....

మరీ.... మరీ.... అదేంటంటే..... నువ్వు అలా చూడకు నాకు భయమేస్తోంది.

అదీ.... అదీ.... నువ్వంటే నాకు చాలా ఇష్టం.... ( సిగ్గు పడుతూ, తల కిందికి దించి)  i love you.... ( కళ్ళు మూసుకోవడం )....

[10/08, 1:40 pm] : మధ్య తరగతి కుటుంబంలో పుట్టి అటు ఇటు కానీ చదువులు చదివి కుటుంబం బాధ్యతల కోసం తన లైఫ్ ని పణంగా పెట్టి నచ్చని ఒక ఉద్యోగం చేస్తూ జీవితంలో ఏమీ సాధించలేక పోయాం అని బాధపడుతూ బాధని గుండెల్లో దాచుకొని పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు వాళ్లు అసలైన హీరోలు

[10/08, 1:40 pm] : పురుషాధిక్యతలో మగవాడు ఎలా అయితే సగటు ఆడదాన్ని చూస్తాడో...! అలాగే...! సమాజం కూడా దాని ఆధిక్యతను మగడిపై.. చూపిస్తుంది.

ఇది అర్థం చేసుకున్న మగాడు ఎప్పటికి... తను ఆధిక్యత చూపించాలి అనుకోడు.

No comments:

Post a Comment